ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ ‘తోక ముడిచారనీ . తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించార’నీ వార్తలొచ్చాయి. సోషల్ మీడియా ఈ వార్తలు వైరలూ అయ్యాయి. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారనీ – ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారనీ అందరూ అనుకున్నారు. అయితే […]
అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. అనుకున్న దానికంటే కాస్త త్వరగానే జరిగిపోయింది. ఎంతో సునాయాసంగా తాలిబన్లు కాబూల్‌ను కూడా ఆక్రమించుకున్నారు. ఆఫ్గనిస్థాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కాబూల్‌ను నాలుగు దిక్కుల నుంచి చుట్టుముట్టిన తాలిబన్లు నగరంలోకి దూసుకెళ్లారు. ఆఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తునట్టు ఆఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్గనిస్థాన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితుడయ్యాడు. రక్తపాతం నివారించడానికి, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగించారు. తాము దాడులుచేయడం లేదని, శాంతియుతంగానే అధికారాన్ని […]