సినిమా ప్రపంచానికి అనేక మంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. అయితే కొంత మంది మాత్రమే పేరు తెచ్చుకుంటారు. మిగిలిన వారు అడపా దడపా సినిమాలు చేసి వెళ్లిపోతుంటారు. లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటారు. అటువంటి వారిలో ఒకరు నటి అర్చన. గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. తర్వాత చిన్న చిన్నక్యారెక్టర్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు.
తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చన వేద శాస్త్రి.. నేను సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. సూర్య, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు. కమలతో నా ప్రయాణం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న అర్చన.. రీసెంట్ గా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించారు. నటిగా సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు పెద్దగా రావడం […]