దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. శుక్రవారం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్లోని లాహోర్ నగరాన్ని ఢిల్లీ అధిగమించడం ఆందోళన కలిగిస్తోంది. పొగమంచు కారణంగా నగరంలో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత ‘ప్రమాదకర స్థాయి’కి చేరుకుంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర […]