హైదరాబాద్‌లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసు సినిమా ట్విస్టుల్లాగా రోజుకో మలుపు తీసుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి సాయికృష్ణతో వివాహేతర సంబంధం కారణంగానే అప్సర హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. పెళ్లై పిల్లలున్న తనను అప్సర పెళ్లి చేసుకోమని కోరడంతోనే బండరాయితో బాది చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడంటూ పేర్కొన్నారు. అయితే ఆమె హత్య ఘటనతో మరో కోణం వెలుగు చూసింది.
అప్సర కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చూసింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా కాస్త వైరల్ గా మారాయి.