మనిషి జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నా కూడా.. బాల్యపు మధురస్మృతులనేవి ఎంతో ప్రత్యేకం. టీనేజ్, మ్యారేజ్ తర్వాత కానీ, వృద్ధాప్యంలో కానీ.. చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘ఏదేమైనా ఆ రోజులే వేరు, చిన్నప్పటి రోజులే బాగుండేవి’ అని అనుకుంటూ ఉంటారు.
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక్క వెలుగు వెలిగిన కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయులు శివ, రాఘవేంద్ర, పునీత్ రాజ్ కుమార్. శివన్న, పునీత్ రాజ్ కుమార్ లు టాప్ హీరోలుగా రాణించారు. 2021 లో గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు.. దీంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.