ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు వీడే పరిస్థితి కన్పించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 5-6 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటింది. రానున్న 12 గంటల్లో ఇది కాస్తా బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చు. మరోవైపు రుతు పవన ద్రోణి సూరత్, డయ్యూ […]