2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని […]