బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]