రాజకీయాల్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటూనే.. సినిమాలపై దృష్టి సారించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దయాకర్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. ఈ సినిమాను బొమ్మక్ మురళీ డైరెక్ట్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలపై సినిమా కథ ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు దయాకర్ […]