హీరోలే కాదు హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లోకి వచ్చిన.. వస్తున్న సంగతి విదితమే. ఆర్తి అగర్వాల్ సోదరి..అదితి అగర్వాల్.. అక్క బాటలోకి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. అలాగే కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా అంతే. అడపా దడపా సినిమాలతో అలరించింది. ఇప్పుడు మరో స్టార్ నటి సాయి పల్లవి సోదరి కూడా సినిమాల్లోకి వచ్చింది. అయితే ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేసిందీ సాయి పల్లవి.
ఫిల్మ్ డెస్క్- సాయి పల్లవి.. ఈ స్టార్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ షో కాకుండా కేవలం నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సాయి పల్లవి. తెలుగులోనే కాదు దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోలు సైతం సాయి పల్లవి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. సాయి పల్లవికి తమ సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా సగం హిట్టైనట్టేనని […]