తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది అలనాటి నటీమణులు కొంత విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పని చేసిన ఇతర భాషల వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి.
సినిమా ప్రపంచానికి అనేక మంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. అయితే కొంత మంది మాత్రమే పేరు తెచ్చుకుంటారు. మిగిలిన వారు అడపా దడపా సినిమాలు చేసి వెళ్లిపోతుంటారు. లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటారు. అటువంటి వారిలో ఒకరు నటి అర్చన. గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. తర్వాత చిన్న చిన్నక్యారెక్టర్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు.
సీనియర్ నటి అర్చన గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చుగాని, మనకంటే ముందు తరం వారికి ఆమె గురించి ప్రత్యేక పరిచకం అక్కర్లేదు. అర్చన తన అందం, నటనతో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. తెలుగులో కోకిల, భారత్ బంద్ , దాసి, లేడీస్ టైలర్, నిరీక్షణ మొదలైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. ఆమె నటనకు “ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం”, “ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు”లు వరించాయి. చాలాకాలం పాటు టాలీవుడ్ […]