క్రికెట్ అమితమైన వినోదం అందించడంతో పాటు అప్పుడప్పుడు అంతులేని విషాదాన్ని కూడా మిగిలిస్తుంది. మైదానంలో అంతసేపు మెరికల్లా కదిలిన ఆటగాళ్లే.. ఉన్నట్టుండి పేకమేడలా కుప్పకూలిపోతారు. ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే పాకిస్తాన్ దేశవాళీ టోర్నీలో చోటు చేసుకుంది. పాకిస్తాన్ టెస్ట్ టీమ్ ఓపెనర్, స్టార్ క్రికెటర్ ఆబిద్ అలీ బ్యాటింగ్ చేస్తూ.. ఒక్కసారిగా గుండెనొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే క్రీజ్ వదిలి పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ టెస్ట్ […]