ఏ క్రికెట్ టీమ్‌లో అయినా.. కోచ్‌ను ఆటగాళ్లు ఎంతో గౌరవంగా చూస్తారు. ఛాంపియన్లతో నిండిపోయినా టీమ్ అయినా.. కోచ్ లేకపోతే ఎందుకూ పనికిరాదు. సరైన దిశలో సాగాలంటే కోచ్ ఉండి తీరాల్సిందే. చెత్త టీమ్‌ను కూడా ఛాంపియన్ టీమ్‌గా మార్చే.. సత్తా కోచ్‌కు ఉంటుంది. అందుకే కోచ్‌కు అంత గౌరవం ఇస్తారు. ముఖ్యంగా క్రికెట్‌లో అయితే.. ఒక టీమ్ హెడ్ కోచ్‌కు ఉండే బాధ్యత, గౌరవం అంతా ఇంతా కాదు. కానీ.. పాకిస్థాన్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడి ఆటగాళ్ల అహంకారానికి ఎంతో మంది స్వదేశి కోచ్‌లు మానసికంగా కుంగిపోయిన వారే. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు జట్టుకు కొంతకాలం సపోర్టింగ్ స్టాఫ్‌గా అలాగే జాతీయ సెలక్ష్షన్ కమిటీలో పనిచేసిన మాజీ క్రికెటర్ సికిందర్ భక్త్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.
సికిందర్ మాట్లాడుతూ..‘పాకిస్థాన్ జట్టులో స్వదేశి కోచ్‌లకు అసలు విలువ ఇవ్వరు. వారు చెప్పింది ఏది పాక్ జట్టులోని స్టార్, సీనియర్ ఆటగాళ్లు అస్సలు పట్టించుకోరు. కోచ్‌ల మాట వినక పోగా.. వారిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతారు. పాకిస్థాన్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన గొప్ప ఆటగాళ్లు జావిద్ మియాందాద్, వకార్ యూనిస్, షక్లైన్ ముస్తాక్, యూసుఫ్ లాంటి వారందరు కూడా పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ నుంచి అవమానాలు ఎదుర్కొన్నవారే. ఆట గురించి పక్కన పెడితే.. ఏ విషయంలో కూడా కోచ్ చెప్పింది వినరు. వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు. ఏదైన విషయం గురించి, వారి ఆటలో లోపం గురించి మాట్లాడితే.. మాకే చెప్పేంద ఉందా అంటూ దారుణంగా మాట్లాడుతూరు. ఒకసారి నేను కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్న సమయంలో ఓ ప్లేయర్ అయితే.. నువ్వు 26 టెస్టులు ఆడావు, నేను 40 టెస్టులు ఆడాను.. ఏం చేయాలో నువ్వు నాకు చెప్తావా అంటూ హేళన చేశాడు.’ అంటూ సికిందర్ పేర్కొన్నాడు.
అయితే.. ఇది కేవలం స్వదేశి కోచ్‌ల వరకు మాత్రమే పరిమితం అని.. ఈ ఆటగాళ్ల విదేశీ కోచ్‌ల ముందు భయంగా ఉంటారని.. నన్ను 26 టెస్టులు ఆడిన క్రికెటర్‌గా చూసిన పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్క టెస్టు కూడా ఆడని మిక్కీ ఆర్థర్‌కు మాత్రం భయపడతారని అన్నాడు. ఇండియాలో రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ లాంటి వారికి లభించిన గౌరవం ఇక్కడ దొరకది సికిందర్ పేర్కొన్నారు. అందుకే దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ జట్టుకు కోచ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరని అన్నారు. ఒక మాజీ క్రికెటర్ అయితే తనను పాకిస్థాన్ జట్టు కోసం పనిచేయమని ఎవరూ కోరకుండా ఉండాలని ఆ దేవుడిని రోజు నమాజ్‌లో ప్రార్థిస్తానని చెప్పారు. పాకిస్థాన్‌కు కోచ్‌గా ఉండేందుకు అంతా భయపడుతున్నారు. అంటూ పాక్ ఆటగాళ్లు అహంకార ధోరణిని వెల్లడించారు సికిందర్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
🚨 ‘They are scared of foreign coaches; don’t respect Pakistan coaches’: Sikander Bakht blasts Pakistan players pic.twitter.com/YaApNtw16V
— MegaNews Updates (@MegaNewsUpdates) February 7, 2023