SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Emotional Scene Between Virat Kohli And Rohit Sharma During 3rd T20 Against Australia

వీడియో: ఎవడ్రా చెప్పింది.. కోహ్లీ అంటే రోహిత్‌కు పడదని! ఈ సీన్‌ చూడండి

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఎవడ్రా చెప్పింది.. కోహ్లీ అంటే రోహిత్‌కు పడదని! ఈ సీన్‌ చూడండి

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి, టీమిండియా కెప్టెన్‌, సీనియర్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మ మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు వినిపిస్తుంటాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే పెద్దగా క్లోజ్‌గా ఉండనే వాదన ఉంది. ఈ ఇద్దరి ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా ఎప్పుడూ గొడపపడుతుంటారు. కానీ.. రోహిత్‌-కోహ్లీ ఎమోషనల్‌ బాండింగ్‌ వేరు. కెప్టెన్లుగా ఒకరినొకరు బ్యాక్‌ చేసుకున్న సందర్భాలు అనేకం. అయినా కూడా ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌తో అవన్నీ వట్టి పుకార్లే అని మరోసారి రుజువైంది. మూడు టీ20ల సిరీస్‌ గెలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మరోసారి కోహ్లీ తన క్లాస్‌ను చూపించి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

Advertisement

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరగానే అవుటైనా.. ముందు భారీ లక్ష్యం ఉన్నా.. యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌కు అద్భుతంగా నిర్మించాడు. ముందు సూర్యకు క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం ఇచ్చాడు. ఈ లోపు రన్‌రేట్‌ పడిపోకుండా మంచి ఎటాకింగ్‌ క్రికెట్‌ ఆడాడు. ఒక్కసారి సూర్య రిథమ్‌లోకి వచ్చిన తర్వాత తాను సైలెంట్‌ అయిపోయి అతనికి స్ట్రైక్‌ ఇస్తూ.. ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో వికెట్‌ను కాపాడుకుంటూ సూర్యకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చాడు. కోహ్లీ అండతో రెచ్చిపోయిన సూర్య 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.

ఇక్కడి నుంచి మళ్లీ ఇన్నింగ్స్‌ను హ్యాండోవర్‌ చేసుకున్న కోహ్లీ.. బ్యాటింగ్‌లో వేగం పెంచాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు వెళ్లినా.. విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో డెనియల్‌ సామ్స్‌ వేసిన తొలి బంతినే భారీ సిక్స్‌ కొట్టి టీమిండియా చేతుల్లో విజయం పెట్టేశాడు. రెండో బంతికే మ్యాచ్‌ ముగించాలనే కసి అద్భుతమై ఓవర్‌ది కవర్స్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అద్భుత క్యాచ్‌కు కోహ్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. కానీ.. అప్పటికే టీమిండియా విజయం ఖాయమైంది. 4 బంతుల్లో 5 పరుగులకే కావాలి. ఆ లాంఛనాన్ని హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌ పూర్తి చేశారు.

బౌన్స్‌ లభిస్తున్న పిచ్‌పై టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి.. పటిష్టమైన ఆసీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదర్కొని భారీ టార్గెట్‌ను ఛేదించిందంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు అవసరమైన సమయంలో వేగంగా ఆడి, అవసరం లేనప్పుడు స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ.. ఇన్నింగ్స్‌ను నిర్మించి తీరు అమోఘం. ఈ విజయంలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ ఎంత ప్రత్యేకమైందో అందరికంటే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బాగా తెలుసు. అందుకే.. విజయానికి అడుగు దూరంలో కోహ్లీ అవుటై డ్రెస్సింగ్‌ రూమ్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎదురొచ్చి మరీ కోహ్లీని అభినందించాడు.

విజయం కోసం కోహ్లీ పడ్డ కష్టమేంటో రోహిత్‌కు తెలుసు. అలాగే మిగిలిన 5 పరుగులను ఇద్దరూ పక్కపక్కన మెట్లపై కూర్చోని చూస్తూ.. పాండ్యా విన్నింగ్‌ షాట్‌ కొట్టగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు సీన్లు సోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి. ‘కోహ్లీ-రోహిత్‌ మధ్య గొడవలున్నాయి అని ఎవరు చెప్పారు’ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోలను తెగ షేర్‌ చేస్తున్నారు. అయినా కోహ్లీ- రోహిత్‌ ఇద్దరి ఆట తీరు, స్వభావాలు వేరైనా.. ఆట పట్ల ఇద్దరికి ఒక విధమైన అకింతభావం కనిపిస్తుంది. వారిద్దరి ఉమ్మడి లక్ష్యం టీమిండియా గెలవాలి. అందు కోసం కోహ్లీ రన్స్‌ చేసినా రోహిత్‌ హ్యాపీ, రోహిత్‌ రన్స్‌ చేసినా కోహ్లీ హ్యాపీ. నిజానికి వీరిద్దరి మధ్య ఉండే ఆ ఎమోషనల్‌ బాండింగ్‌ చాలా మందికి అర్థం కాదు. మరి వీరిద్దరి బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

.@imVkohli 🤝 @ImRo45

Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg

— BCCI (@BCCI) September 25, 2022

🥹🤩pic.twitter.com/wB3Z1DmEpV

— CricTracker (@Cricketracker) September 25, 2022

ఇది కూడా చదవండి: రోహిత్‌ పిచ్చికొట్టుడు.. తొలి ఓవర్‌ తర్వాత మళ్లీ బాల్‌ ముట్టుకోని నెం.1 బౌలర్‌!

Tags :

  • Cricket News
  • IND vs AUS
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వికారాబాద్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

  • 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన కుమ్‌కుమ్ మోహోడ్.. ఆసియా గేమ్స్ ఆర్చరీలో గోల్డ్

  • రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • హిజ్రాల ముసుగులో వసూళ్లు.. 500 కెమెరాలు చెక్ చేసి పట్టుకున్న పోలీసులు

  • ఫుట్ బాల్ చరిత్రలో మొదటిసారి..నేడు బ్రెజిల్ తో భారత్ ఢీ

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • ఇది కదా.. మన హాకీ టీం అంటే..44 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ వచ్చేసింది

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam