హైదరాబాద్- కరోనా మహమ్మారి అంతకంతకు విజృంబిస్తోంది. దీంతో కరోనా పేరు చెబితేనే అంతా వణికిపోతున్నారు. కరోనా సోకిన రోగి దగ్గరకు సొంత కుటుంబ సభ్యులు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. హోంఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులకు ఇంట్లో దూరం నుంచే వారికి కావాల్సిన మందులు, ఆహారం అందిస్తున్నారు ఫ్యామిలీ మేంబర్స్. కరోనా సోకిన వారి దగ్గరకు వెళ్తే తమకెక్కడ వైరస్ సోకుతుందోనని అందరికీ భయం. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ రోజు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఐతే ఇందులో ఫిదా అవ్వాల్సిన అంశం ఏముందని అనుకుంటున్నారు కదూ. ముఖ్యమంత్రి కేసీఆర్ 1500 మంది కరోనా రోగులున్న ప్రభుత్వ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అంత మంది కరోనా రోగులన్న ఆస్పత్రికి కనీసం పీపీఈ కిట్ కూడా ధరించకుండా వెళ్లారు కేసీఆర్. కేవలం మాస్క్ ధరించి ధైర్యంగా గాంధీ ఆస్పత్రిలో అణువణువూ కలియతిరిగారు. అంతే కాదు జనరల్ వార్డు నుంచి మొదలు ఐసీయూ వార్డు వరకు ప్రతి వార్డు కలియతిరిగారు. అన్ని వార్డుల్లోని కరోనా రోగులను పలకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యం, ఇస్తున్న మందులు, పెడుతున్న ఆహారం.. ఇలా అన్ని విరాలను ఓపిగా అడిగారు ముఖ్యమంత్రి. కొంత మంది రోగులు చెప్పేది వినిపించక పోవడంతో వారి వద్దకు ఒంగి మరీ విన్నారు సీఎం కేసీఆర్.
అంతే కాదు మీకేం కాదని.. తప్పకుండా కరోనా నయం అవుతుందని, దైర్యంగా ఉండాలని వారికి ఆత్మవిశ్వాసం కలిగించారు ముఖ్యమంత్రి. రోగులందరికి బొటన వేలుతో విక్టరీ సింబల్ చూపించి ధైర్యం నింపారు. కేసీఆర్ ఇచ్చిన భరోసాతో కరోనా రోగులంతా సంతృప్తి వ్యక్త పరిచారు. ఇలా 1500 మంది కరోనా రోగులున్న ఆస్పత్రికి ముఖ్యమంత్రి హోదాలో కనీసం పీపీఈ కిట్ ధరించకుండా వెళ్లి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు కేసీఆర్. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే కదా. ఇకఎప్పుడూ ఫాంహౌజ్ లోనే కూర్చుంటారని కేసీఆర్ పై విమర్శలు చేసే వారికి ఈ ఘటన ద్వార కేసీఆర్ గట్టిగా సమాధానం చెప్పారన్న కామెంట్స్ వినిపిస్తున్నారు.
Telangana cm kcr
