కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు. ఏపీలో జరుగుతున్న కీలక పరిణమాలపై చంద్రబాబు షాకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అమిత్ షాని కలవాలని వెళ్లినా అపాయింట్ మెంట్ కుదరకపోవటంతో సోమవారం రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై 8 పేజీల మెమోరాండంను రాష్ట్రపతికి అందజేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి సూచించారు.
అయితే ఇటీవల చంద్రబాబుకు షా అపాయింట్ మెంట్ కుదరని కారణంగా తాజాగా అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా, టీడీపీ ఆఫీసులపై దాడుల వంటి అంశాలను చంద్రబాబు అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు వైసీపీ పాలనలో అన్యాయాలు పెచ్చుమీరుతున్నాయని, వీటికి అడ్డుకట్టవేయకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చంద్రబాబు అమిత్ షాకు వివరించినట్లు సమాచారం.
