అతడు యంగ్ హీరో. చూస్తే ఇంకా పెళ్లి కాలేదేమోనని అనుకుంటారు. కానీ టీనేజ్ లోకి వచ్చిన ఇద్దరు పిల్లలున్నారు. భార్యని చూస్తే హీరోయిన్ ని మించి ఉంటుంది. మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా?
తెలుగులో ఎందరో హీరోలున్నారు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోహీరోయిన్లు వస్తూనే ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. అయితే వీళ్లలో చాలా తక్కువమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుంటారు. కొందరు పెద్దగా మూవీస్ చేయకపోయినప్పటికీ.. టాలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తారు. అలా టాలీవుడ్ లో ఇప్పటివరకు 10 సినిమాలు చేసిన ఓ హీరో ఫ్యామిలీకి సంబంధించిన పిక్ ఒకటి వైరల్ అయింది. సదరు హీరో భార్య-కూతురిని చూసి అందరూ షాకవుతున్నారు. హీరోయిన్ కి మించిన భార్య ఉందా అని అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ హీరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు బ్యూటీస్ నటుడు శ్రీకాంత్ భార్య-కూతురు. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు గానీ శ్రీరామ్ అంటే మాత్రం కొందరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అప్పుడెప్పుడో 2003లో ‘ఒకరికి ఒకరు’ చిత్రంలో హీరోగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు వచ్చినట్లు లేవు. దీంతో తమిళంలోనూ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. వెంకటేష్-త్రిష ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ మూవీలో సహాయ పాత్రలో నటించి మెప్పించాడు. అలా తెలుగు ప్రేక్షకుల్ని అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నాడు.
తెలుగులో పైన చెప్పిన సినిమాలతో పాటు పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, రాగల 24 గంటల్లో, వై, అసలేం జరిగింది?, 10th క్లాస్ డైరీస్ లాంటి సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నాడు. మన దగ్గర కాదు గానీ తమిళంలోనూ మాత్రం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాల్లో యాక్ట్ చేసి ఫేమ్ సంపాదించాడు. విజయ్ ‘స్నేహితుడు’లోనూ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ గా కనిపించి శ్రీరామ్ నే. గతేడాది మూడు సినిమాలు చేసిన శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్.. ప్రస్తుతం లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘భగీరా’ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా వందన అనే అమ్మాయిని 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఓ బాబు, పాప ఉన్నారు. మరి పై ఫొటోలో భార్య-కూతురిని చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.