Anasuya: ఇండస్ట్రీలో సినీతారలు, బుల్లితెర ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా ఎవరైనా గ్లామర్ విషయంలో ఒక్కటే. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ ఆర్టిస్టుల గ్లామర్ కి ప్రాధాన్యత మారుతుంటుంది. ప్రస్తుతం బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ విషయంలో కొత్తగా విమర్శలు మొదలైనట్లు తెలుస్తుంది. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, సినీనటిగా మంచి గుర్తింపు పొందిన యాంకర్ అనసూయ.. ఓవైపు టీవీ షోలతో పాటు మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటోంది.
జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ.. తన అందచందాలతో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకొని క్రేజ్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక రంగస్థలం సినిమాతో నటిగా మారి తన విశ్వరూపాన్ని బయటపెట్టింది. అప్పటినుండి అనసూయ.. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తోంది. అయితే.. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్, వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తన అందం, గ్లామర్ పై పాజిటివ్ కామెంట్స్ తో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. అయితే.. సోషల్ మీడియా ట్రోల్స్ అనేవి అనసూయకు కొత్త కాదు. ఇదివరకు చాలాసార్లు తనను కామెంట్ చేసినవారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా అనసూయపై సోషల్ మీడియా ట్రోల్స్ అనేవి మాత్రం ఆగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇటీవల అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలపై వచ్చిన కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఫోటోలలో అనసూయ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయంటూ.. మేకప్ కుదరలేదా లేక ముసలితనం వచ్చేసిందా? అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి అనసూయపై వస్తున్న ట్రోల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.