Marthand K. Venkatesh: తెలుగులో మంచి ప్రతిభ, పేరున్న అతి కొద్ది మంది ఎడిటర్లలో మార్తాండ్ కే వెంకటేష్ ఒకరు. ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. తెలుగులో టాప్ డైరెక్టర్లందరితో పని చేశారు.. చేస్తున్నారు. తాజాగా, ఆయన ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పలు థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న మార్తాండ్ కే వెంకటేష్ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ ఎడిటింగ్ గురించి స్పందించారు. తాజాగా, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
‘‘ కేజీఎఫ్ లాంటి ఎడిటింగ్‌ను మేము ఒప్పుకోము. రెండున్నర గంటలు అన్ని వందల షాట్లు చూస్తే తల చెదిరిపోతుంది. అవి మేము రాంగ్ అంటుంటామ్. జనరల్‌గా మాకు ఇలాంటి గొడవలే అవుతుంటాయి. సార్! ఇది ఫోర్ మినిట్ సాంగ్ సార్.. ఎవరీ మినిట్ ఓ షాట్ మారాలి అంటుంటారు. అరే! బాబు ఎవరీ సెకండ్ ఓ షాట్ మారాలని ఎందుకు అనుకుంటున్నావు. అక్కడ ఎన్ని షాట్లు పడాలో అన్ని షాట్లు పడేటట్లు చూద్దాం అంటాను నేను….. కేజీఎఫ్ సినిమా ఆల్రెడీ హిట్ అయింది. దాని గురించి మాట్లాడటం, కాంట్రవర్సీ చేయటం… నేను సినిమా చూల్లేదు. విన్నాను. ఐ జర్క్ లాగా అనిపించిందంట. సస్టయిన్ అవ్వకుండా, రిజిస్ట్రర్ అవ్వకుండా కట్ అయిందని విన్నాను. చూడంది కామెంట్ చేయటం కరెక్ట్ కాదు.’’ అని అన్నారు. మరి, మార్తాండ్ కే వెంకటేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Deepa Jagadeesh: సీరియల్ నటి వివాహం.. వీడియో వైరల్!