తల్లిదండ్రులకు బిడ్డలు పుడితే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. చిన్నప్పటి నుంచే వారి అలనా, పాలన చూసుకుంటు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. కాస్త పెద్దయ్యాక వారి చదువులు, పెళ్లిల్లు వంటి కార్యక్రమాలు చేసి అత్తారింటికి పంపి కూతురు ఇంట్లో లేదన్న బెంగతో చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. ఇంకో రకంగా మాట్లాడుకుంటే.. ఇక కూతురుకి ఏం జరిగిన భరించలేని తల్లిదండ్రులు ఉంటే.. ఓ కసాయి తండ్రి మాత్రం తన కన్న కూతురునే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
ఇలాంటి దారుణ ఘటన హైదరాబాద్ నడి ఒడ్డున చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం.10 లో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. అయితే గత కొంత కాలంగా ఆ యువతి తల్లి పేరు మీదున్న ఇంటి అద్దె విషయంపై తరుచు తండ్రితో గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో కూతురు తన తండ్రిపై ఎదురు తిరిగేందుకు ప్రయత్నం చేసేంది. ఇక దీనిపై కోపం ఆపుకోలేని తండ్రి కూతురుని ఇంట్లో నుంచి వెళ్లాలంటూ ప్రతి రోజు హింసిస్తుండే వాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ తండ్రి నా మాట వినకుంటే రేప్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
