దేశంలోని ప్రజలంతా దీపావళి వేళ పండగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు. విద్యుత్ దీపాలతో నగరాలన్నీ వెలుగులు జిమ్ముతున్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే బీహార్లోని బెట్టియాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఎనిమిది వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృత్యువాతపడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెల్హువా గ్రామంలోని దీపావళి వేళ స్నేహితులంతా ఓ చోట చేరి మద్యం సేవించారు. ఇక కొంత సమయం తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థకు గురవ్వటంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
8 మంది మరణించారని, ప్రస్తుతం పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక పండగ పూట దక్షిణ తెల్హువా గ్రామంలో జరిగిన ఈ ఘటన విషాదంగా మారింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని అక్కడ మద్యం సీసా, హీమోపతిక్ మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఇద్దరు అనుమానితులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
