దేశంలోని ఆటోమొబైల్ రంగంలో అత్యంత నమ్మకమైందిగా ఉన్నది మారుతి సుజుకి. ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టింది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 12 వందల కిలోమీటర్లు దూసుకుపోతుంది. అంతేకాదు..లక్షన్నర రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మార్కెట్‌లో ప్రస్తుతం హైబ్రిడ్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. రోజురోజుకూ ఆయిల్ ధరలు పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. అందుకే చాలా కంపెనీలు హైబ్రిడ్ మోడల్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. మారుతి సుజుకికి చెందిన ప్రముఖ ఎస్‌యూవీగా ఉన్న గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్ కొత్తగా వచ్చింది. గత నెల అంటే జూలై నెలలో ఈ కారుపై మారుతి సుజుకి కంపెనీ ఏకంగా 1.84 వేల రూపాయలు డిస్కొంట్ అందించింది. ఇప్పుడు ఆగస్టు నెలలో 1.54 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ దాదాపు అన్ని వేరియంట్లకు లభించనుంది. మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫాతో పాటు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌కు కూడా డిస్కౌంట్ వర్తించనుంది.
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఇంజన్ 1462 సిసి కే15 ఇంజన్ కలిగి ఉంటుంది. 6000 ఆర్పీఎంతో 100 బీహెచ్‌పి పవర్, 135 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టెడ్ ఆటోమేటిక్ వ్యవస్థ ఉంటుంది. ఈ కారు ఇ సివిటి 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ ఉంటే 1200 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర 11.42 లక్షల నుంచి ప్రారంభమై 20.68 లక్షలు పలుకుతుంది.