బిగ్ బాస్ ఓటిటి సీజన్ మొదలైందో లేదో అప్పుడే హౌస్ లో గొడవలు, మనస్పర్థలు, కక్ష సాధింపులు జరుగుతున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ అంటే అందరూ కొత్తవాళ్లే అయితే షో ఒకలా ఉంటుంది. కానీ సగం కొత్త, సగం పాత అయ్యేసరికి సీనియర్లు, జూనియర్లను డామినేషన్ చేయడమనేది కనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ బ్యూటీలకు కొదవే లేదు.
అషు రెడ్డి, శ్రీరాపాక, అరియానా, తేజస్వి, స్రవంతి, మిత్రా శర్మ ఇలా వీరంతా కావాల్సినంత బోల్డ్ నెస్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. షో ఇటీవలే మొదలైంది కాబట్టి.. టాస్కులు కూడా పెద్దగా కష్టపడేలా లేవు.. కానీ తాజాగా జరిగిన ఓ గేమ్ చూస్తే అందరికి మతిపోతుంది. ఈ గేమ్ లో బిగ్ బాస్ ఒక వీల్ పెట్టి.. అది ఎవరి సైడ్ ఆగితే వారు కార్డులో ఉన్న ప్రశ్నలకు నిజాయితీగా ఆన్సర్ చేయాలి అనేది రూల్.
ఈ క్రమంలో హౌస్ లో పాల్గొన్న వారంతా బోల్డ్ అని అర్థమవుతుంది. అయితే.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డికి.. ‘మీరు ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి డేట్ చేశారా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ‘ఓ నెంబర్ ఆఫ్ టైమ్స్'(ఎన్నో సార్లు) అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. మరి అషు.. చెప్పింది నిజమో కాదో తెలియదు. కానీ ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు. మరి అషు రెడ్డి ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
