గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు బాగా వేడెక్కిపోతున్నాయి. ఎవరి బలాలు వారు నిరూపించుకునేందుకు గట్టి పట్టుమీద ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసిన బండి సంజయ్ తన యాత్రను శనివారం ముగించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అధికార పార్టీపై నిప్పులు కురిపించారు. […]