ఛత్తీస్‌గడ్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పేడ చోరీ కావటం సంచలనమైంది. మన దేశంలో ఇది బాగానే […]