ప్రస్తుత సమాజంలో యువతీ,యువకులు హద్దు మీరుతున్నారు. ప్రేమ పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారు. చివరకు ప్రేమించిన వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ముంబైకి చెందిన శ్రద్ధా వాకర్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె ప్రియుడే ఆమెను దారుణంగా చంపేశాడు. ముక్కలు చేసి బయట పడేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు ప్రతీరోజు ఏదో ఒక ప్రాంతంలో ప్రియురాళ్లపై ప్రియుళ్లు దారుణానికి ఒడిగడుతున్నారు. […]