Diganth: ప్రముఖ కన్నడ హీరో దిగంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లిన దిగంత్.. సరదాగా బీచ్ లో ఆడుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. బీచ్ లో జంప్ చేసే క్రమంలో.. అనుకోకుండా కింద పడిపోయి మెడకు తీవ్రంగా గాయమైనట్లు కన్నడ సినీవర్గాల సమాచారం. ఇక వెంటనే గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన కుటుంబ సభ్యులు.. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఎలాంటి ఆలస్యం […]