Chittoor Crime : ఓ అటవీ ప్రాంతంలో మహిళ అస్థిపంజరం వెలుగుచూడటం కలకలం రేపింది. పుర్రె చెట్టుకు వేలాడుతూ ఉండటం.. చూసిన వారిని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన చిత్తూరులోని నగరిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డీవీఆర్ కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేకలు కాయటానికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆదివారం అక్కడి ఓ చెట్టుకు వేలాడుతున్న పుర్రెను చూశారు. దీంతో భయపడిపోయి అక్కడినుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు […]