స్టార్ హీరోయిన్ రష్మిక మందాన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పుష్ప సినిమా తర్వాత రష్మికకి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ లభించిన సంగతి తెలిసిందే. ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం రష్మిక అందానికి, నటనకు ఫిదా అవుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. పలు పాపులర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కి, ట్రావెల్ ఏజెన్సీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది రష్మిక.