మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న తండ్రిని చిన్ని గొంతుతో డాడీ.. డాడీ.. అని అరిచి పిలిచి.. నాన్న చూడగానే ముసిముసి నవ్వులతో మురిసిపోయిన చిన్నారి. సీరియస్‌గా జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ వద్ద బంతికోసం కాపుకాస్తుండగా కూతురి పిలుపుతో ఉప్పొంగిన తండ్రి మనసు. చూడగానే మనసుకు హాయినిచ్చే కూతురి చిరునవ్వు చూసి మ్యాచ్‌లో ఒత్తిడిని మర్చిపోయిన అనుభూతి పొందింది ఇంకెవరో కాదు సౌతాఫ్రికా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్. సాధారణంగా ఆడపిల్లలకు నాన్నంటే ప్రత్యేకమైన ప్రేమ. […]