ప్రముఖ రచయిత, గేయ కారుడు జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణంపై సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటిచారు. జననాట్య మండలి ప్రముఖ కళాకారుడిగా పేరు గాంచిన జంగు ప్రహ్లాద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఇక అతని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురం గ్రామం. ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక దీంతో పాటు ఆయన మరణవార్త జననాట్య మండలి కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. జంగు ప్రహ్లాద్ తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
