ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ టూర్ లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 సిరీస్ సారధిగా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. అయితే.. మాజీ సారధి విరాట్ కోహ్లీని ఈ టూర్ కు ఎంపిక చేయలేదు.
ఐపీఎల్ తర్వాత విశ్రాంతి పేరుతో కాస్త ఉపశమనం పొందిన కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తాడనుకున్నారు. కానీ, కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 43 (టెస్ట్‌లో 31, టీ20ల్లో1, 11) పరుగులే చేశాడు. పోనీ వన్డేల్లో అయినా రాణిస్తాడనుకుంటే.. బరిలోకి దిగలేదు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి వన్డేకు దూరమైన కోహ్లి.. రెండో వన్డేలో కూడా ఆడక పోవచ్చు. పరుగుల లేమితో సతమతమవుతున్న కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు.. విరాట్ కోహ్లీని కరేబియన్ టూర్ కు ఎంపిక చేయలేదు.
India’s squad for T20I series against West Indies announced; Rohit Sharma named Captain, Virat Kohli not named as part of the squad pic.twitter.com/l5q652cK64
— ANI (@ANI) July 14, 2022
వెస్టిండీస్ టూర్ లో భారత జట్టు.. జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. జూలై 22 నుంచి 27 వరకు వన్డే సిరీస్ జరుగనుండగా.. విండీస్- టీమిండియా మధ్య జూలై 29 నుంచి పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. విండీస్ తో వన్డే సిరీస్ కు ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. టీ20లకు తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ విండీస్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు.
అయితే.. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. వన్డే సిరీస్ లో విశ్రాంతి కోరుకున్న కోహ్లీ దానిని పొడిగించాలని సెలక్టర్లకు చెప్పిన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లీకి మళ్లీ రెస్ట్ ఇవ్వడంపై కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో సెలక్టర్లు మాత్రం విరాట్ కోరికను మన్నించారని బోర్డు వర్గాలు తెలిపాయి.
భారత జట్టు(టీ20 సిరీస్):
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దికక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.
— BCCI (@BCCI) July 14, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli-Chiranjeevi: చిరు పాటలకు కోహ్లీ చిందులేసేవాడు! తెలుగు క్రికెటర్ రవితేజ ట్వీట్!
ఇది కూడా చదవండి: SuryaKumar Yadav: సూర్య కుమార్ యాదవ్ సక్సెస్ కు కారణం ఆమేనా?