సమాజంలో అత్యచారాలు రోజు రోజుకు పెరుగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా.. చుట్టాల్లా పలకరిస్తున్నాయి అనే భావనలో నిందితులు ఆలోచిస్తున్నారు. ఒక ప్రియుడు ప్రేయసిని వేదించడం, హత్య చేయటం, ప్రియురాలు ప్రేమకు ఒప్పుకోలేదంటూ యాసిడ్ పోయడం వంటి అఘాయిత్యాలు చూస్తుంటాం. కానీ తమిళనాడులో మాత్రం ఓ తండ్రి కన్న కూతుళ్లపై లైంగికంగా వేదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళితే..తమిళనాడు రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదివిలో ఉన్నాడు ఇలాంగోవన్ అనే వ్యక్తి. ఆయనకు 13, నుంచి 11 ఏళ్ల మధ్యలో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక దీంతో ఈ రాక్షసుడు వారిని ప్రతీ రోజు వేదించటం మొదలు పెట్టాడు. కన్న కూతుళ్లు అని చూడకుండా కర్కశంగా వ్యవహరించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కళ్లు నెత్తికెక్కి ఓ మానవ మృగంలో తయారయ్యాడు. ప్రతీ రోజు తన ఇద్దరు కూతళ్లపై లైంగింగా వేదించటం మొదలుపెట్టాడు.
దీంతో అడ్డమొచ్చని భార్యపై కూడా విచక్షణ రహితంగా కొట్టాడటం, వేదించటం ఇలా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశాడు ఇలాంగోవన్. ఇక ఆయన ఆగడాలు భరించలేని తల్లి, కూతుళ్లు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇలాంగోవన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి రావటంతో పాటు స్థానికంగా సంచలనంగా మారింది. సభ్య సమాజానికి న్యాయం చేయాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా చేయటం అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
