ఇటీవల భారత్ లో భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5 గా నమోదయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటన చేసింది. ఇండోర్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించింది. భూమిలో ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఇది చదవండి: ఛీ.. కన్న కూతురుని చంపి.. అత్యాచారం! వీడు మనిషేనా!
ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. కాకపోతే.. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల ప్రారంభంలో అఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. అలాగే భారత్ లోని ఢిల్లీ, జమ్మూకశ్మీర్, నోయిడా, ఉత్తరాఖండ్ లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.