యూరప్‌లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. బ్రిటన్‌లో గంటకు 196 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకదశలో గాలుల ధాటికి జనాలు రోడ్లపై నిలువలేకపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే పడిపోతున్నారు. యూరప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు విమానాలు సైతం ఊగిపోతున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి.
బలంగా గాలులు వీయడం వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రంలోని అలలు కూడా ఎగసిపడ్డాయి. దీంతో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయారు.
These people get blown over by the wind as Storm Eunice batters people to the ground in Croydon, South London.#StormEunice pic.twitter.com/ZUM63K93Ae
— talkRADIO (@talkRADIO) February 18, 2022