బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమి అలీ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 20 సంవత్సరాల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిన ఈ పాకిస్థానీ బ్యూటీ.. సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంది. షోబిజ్ నుండి బయటికి వచ్చాక సోమి.. ఇప్పుడు మహిళా హక్కులు, గృహహింస మరియు లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల కోసం పోరాడుతోంది. వారికోసం ‘నో మోర్ టియర్స్’ అనే NGO స్థాపించింది.
ఇక తాజాగా సోమి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ బాలీవుడ్ లో చర్చలకు దారితీసింది. బాలీవుడ్ లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘హార్వే వెన్‌స్టన్ ఆఫ్ బాలీవుడ్’ నీ గురించి ఈ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఎలాగైతే నిజాన్ని బయట పెట్టిందో.. అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు’ అని రాసుకొచ్చింది.ఈ పోస్టుకు సల్మాన్ ఖాన్ ‘ఆతే జాతే హస్తే గాతే’ సాంగ్ ఫోటోను జతచేసింది. కానీ వేధింపులకు గురిచేసిన వ్యక్తి పేరును చెప్పకుండా కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. కాగా హాలీవుడ్ స్టార్ హార్వే వెన్‌స్టన్ సుమారు 200లకు పైగా సినిమాలు నిర్మించాడు. మీటూ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు హార్వే తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి యత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 2020 మార్చి 11న అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఆ విధంగానే బాలీవుడ్ లో ఉన్న హార్వే వెన్‌స్టన్ ఎవరా? అని జనాలు ఆలోచనలో పడ్డారు. ఇక సోమి పోస్టులో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ లను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం సోమి అలీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి సోమి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.