మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘రారాజు’. ఎన్నో కష్టాలు పడి ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన ‘విజేత’. కష్టపడి ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వారికి ఆయన ‘గాడ్ ఫాదర్’. అలాంటి వ్యక్తి గురించి ఎన్నిచెప్పినా తక్కువే. అలాంటి చిరంజీవిపై సినిమాల పరంగా పోటీ ఉన్న మరొక కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రశంసిస్తే ఎలా ఉంటుంది. మెగా అభిమానులకు పట్టలేని ఆనందం ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. నందమూరి హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకి ఆ వీడియోలో ఎన్టీఆర్ ఏమని ప్రశంసించాడో ఇప్పుడు తెలుసుకుందాం..
నందమూరి చిన్నోడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. అందుకు కారణం కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైంది. ఈ టీమ్ అంతా అక్కడ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు సైతం ఈ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రమోషన్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించారు. రాంచరణ్ పక్కన ఉండగా ఎన్టీఆర్ మెగా స్టార్ పై ప్రశంసలు జల్లు కురించారు.
రాం చరణ్ ని చూపిస్తూ…”వీరి తండ్రి తెలుగు చిత్ర సీమలో గొప్ప డ్యాన్సర్. అలాగే మాకు బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ప్రభుదేవా ను ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుస్తాం” అని తారక్ అన్నారు. ఇలా నందరమూరి తారక రాముడు.. చిరంజీవి పేరు ప్రసావించకున్నా పరోక్షంగా ఆయన్ని గ్రేటెస్ట్ డ్యాన్సర్ అంటూ పొగడటంతో మెగా అభిమానలు తెగ సంతోషపడుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సినిమాల పరంగా నందమూరి, మెగా హీరోల మధ్య ఫ్రెండీ పోటీ ఉంటుంది. అయితే ఆ రెండు కుటుంబాల హీరోలు కలిసి సినిమాలో నటిస్తారా? నటిస్తే ఎంత బాగుంటుందో.. అని అందరూ అనుకునే వారు.
వారు కోరికను నిరవేరుస్తూ దర్శధీరుడు రాజమౌళి ముందడుగు వేశారు. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రాం చరణ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. అనేక రికార్డులను సైతం క్రియేట్ చేసింది. అయితే ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
Charan’s Father MegaStar @KChiruTweets Is A Biggest Dancer🔥🤙😎⚡ pic.twitter.com/yAdDko17Rm
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) October 26, 2022