ప్రముఖ నటుడు, మరాఠీ దర్శకుడు రవీంద్ర మహాజని ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోగల ఫ్లాట్‌లో ఆయన మృతదేహం కనుగొన్నారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, మరాఠీ దర్శకుడు రవీంద్ర మహాజని ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోగల ఫ్లాట్‌లో ఆయన మృతదేహం కనుగొన్నారు. కాగా, రవీంద్ర రెండు, మూడు రోజుల క్రితమే మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రవీంద్ర మహాజని కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న ఫ్లాట్‌లో నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్నవారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రవీంద్ర శవమై కనిపించారు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
రవీంద్ర మారాఠీతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించారు. మరాఠీ ఇండస్ట్రీలో ఆయన్ని వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తుంటారు. ఆయన వ్యక్తిత్వంతో పాటు పోలికలు కూడా వినోద్ ఖన్నా మాదిరిగా ఉండంతో ఆ పేరుతో సంబోధిస్తుంటారు. మరాఠీలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘సౌత్ హిందుస్తానీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మరాఠీలో ‘ఆరం హరామా ఆహే’, ‘దునియా కరీ సలామ్’, ‘హల్దీ కుంకు’ వంటి సినిమాలు చేశారు.
‘ముంబాయి చా ఫౌజార్ద్’ (1984). ‘కలత్ నకలత్’ (1990), ‘లక్ష్మీ చి పావ్లే’ మూవీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అర్జున్ కపూర్ – కృతి సనన్ నటించిన ‘పానిపట్’ (2019) ఆయన నటించిన చివరి చిత్రం. రవీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని ‘ఇమ్లీ’ అనే హిందీ సీరియల్‌లో నటించాడు. ‘క్యారీ ఆన్ మరాఠా’ లో కొడుకుతో కలిసి అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీని తండ్రికి అంకితమిచ్చాడు గష్మీర్. రవీంద్ర మహాజని మృతికి హిందీ, మరాఠా సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు
Veteran actor Ravindra Mahajani found dead in Pune
Read @ANI Story | https://t.co/gGyIUyF6Fi#RavindraMahajani #Death #MarathiCinema pic.twitter.com/Piweriu4rs
— ANI Digital (@ani_digital) July 15, 2023