అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, సరిగ్గా అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మొదలైన భారీ వర్షం, ఏకంగా రెండు నుంచి మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసింది. తెల్లారేసరికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తూ జలమయమయ్యాయి! అసలు ఏయే ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది? లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ […]
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద నీటలో మునిగాయి. రహదారి మార్గాలు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.
గత పదిహేను రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచేత్తుతున్నాయి. దీంతో నగర వాసులకు ప్రత్యేకించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అంతేకాదు జోనల్ వారీగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.