చదువుల తల్లి ఒడిలో తమ బిడ్డలు క్షేమంగా ఉంటారని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశతో గురుకులాలకు, హాస్టళ్లకు పంపిస్తుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ తీరు చూస్తుంటే.. ఆ భరోసా కాస్తా ఇప్పుడు భయంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా నియామకాలు, మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో పసిప్రాణాలు గాలిలో కలుస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది? ఈ […]