నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటూ.. బీజేపీపై విమర్శలు కురిపిస్తూ ఉండే రాహుల్ గాంధీ.. తాజాగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన స్వరా భాస్కర్ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పెళ్లిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలా వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని నిలదీస్తున్నారు.