హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతూ ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. చేతికొచ్చిన బిడ్డలు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న కుర్రాళ్లు ఇలా రోడ్డు ప్రమాదంలో కళ్లముందే విగతజీవులుగా మారడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గేటు సమీపంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వాసవి కాంక్రీట్ కంపెనీకి […]