ఏం మ్యాచ్ రా బాబు.. నరాలు కట్ అయిపోయినాయ్! థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా అనే ఫీల్ వచ్చింది. మరీ ముఖ్యంగా చివరి ఓవర్ లో 20 రన్స్ కావాల్సిన టైంలో మ్యూచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ తో గోళ్లు కొరికేసుకున్నారు. ఏదైతేనేం ఫైనల్ గా టీమిండియా, బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించింది. భారత్ అభిమానులందరూ హమ్మయ్యా అనుకున్నారు. అయితే చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపుపై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆడిలైడ్ లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. గత మూడు మ్యాచుల్లో విఫలమైన కేఎల్ రాహుల్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలానే కోహ్లీ 64 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో బంగ్లా జట్టు 7 ఓవర్లకు 66 పరుగులతో ఉన్న దశలో మ్యాచ్ ని వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు అరగంటకు పైగా ఆటని నిలిపేశారు. ఇక వర్షం తగ్గడంతో మ్యాచ్ ని 16 ఓవర్లకు కుదించారు. బంగ్లా టార్గెట్ 151గా ఫిక్స్ చేశారు. దీంతో 54 బంతుల్లో 85 పరుగులని లక్ష్యంగా విధించారు.
ఇక వర్షం పడకముందు వికెట్ కూడా కోల్పోని బంగ్లాదేశ్.. మళ్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి రెండో బంతికి ఫుల్ ఫామ్ లో ఉన్న లిట్టన్ దాస్ రనౌట్ అయ్యాడు. అక్కడ మొదలైన బంగ్లా తడబాడు.. చివరి ఓవర్ చివరి బంతి వరకు సాగింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లా ఆటగాడు నురుల్ హాసన్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఓ బౌల్ వైడ్ గీతపై పడింది. కానీ దీన్ని బాల్ గానే పరిగణించారు. అంతకు ముందు కోహ్లీ అప్పీల్ చేయగానే ఓ బంతిని అంపైర్లు నో బాల్ గా ప్రకటించారు.
ఇక వర్షం పడుతున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర అంపైర్లతో బంగ్లా కెప్టెన్ షకీబ్ గొడవ పడుతున్నట్లు కనిపించాడు! ఈ విజువల్స్ చూసిన ఎవరికైనా సరే సేమ్ ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ పక్కనబెడితే ఐసీసీ టోర్నీలో భారత జట్టు.. సెమీస్ లేదంటే ఫైనల్ వరకు ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. లేదంటే మ్యాచ్ కాదు కదా కనీసం ఆ వైపు కూడా వెళ్లరు. ఈ అంశాలన్నీ ఎత్తిచూపుతున్న పలువురు పాక్ ఫ్యాన్స్.. ట్విట్టర్ లో బంగ్లా జట్టుపై విమర్శలు చేస్తున్నారు. ఇండియా గెలిచిందా? కావాలనే గెలిపించిందా అనే కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
An incredible win for Team India! 🤯🤯🤯
What was the turning point in that 5-run (DLS) win?#BelieveInBlue #ViratKohli #KLRahul #INDvsBAN #INDvBAN | ICC Men’s #T20WorldCup 2022 pic.twitter.com/iiVXaGabce
— Star Sports (@StarSportsIndia) November 2, 2022
This runout changed the moment of the match
What a throw from #KLRahul
Bangladesh given the tight fight to india👏#IndvsBan #T20WorldCup pic.twitter.com/mDRvBQeBfK— Sainath Ry (@SPonnapureddy) November 2, 2022
India go on top of the Group 2 table with three wins 🔝#T20WorldCup Standings 👉 https://t.co/TIZ6Sk3coG pic.twitter.com/OlOuDbp0nZ
— T20 World Cup (@T20WorldCup) November 2, 2022