ఫిల్మ్ డెస్క్- RRR సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రామ్ చరణ్ లు నటిస్తుండటంతో RRR పై మంచి క్రేజ్ ఏర్పడింది. మామూలుగా ఐతే RRR సినిమా ఈనెల 7న విడుదల కావాల్సి ఉంది. కాని దేశవ్యాప్తంహా కరోనా కేసులు పెరుగుతుండటంతో RRR మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు రాజమౌళి.
మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు RRR విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఈ సినిమాను వీక్షించిన దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్స్ సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి.
తాను RRR సినిమాను చూశానని చెప్పిన ఉమైర్, ఒక్క కట్ కూడా చెప్పాల్సిన అవసరం రాలేదని అన్నాడు. ఇక ఎన్టీఆర్ పర్ఫామెన్స్కు జాతీయ అవార్డు రావాల్సిందేనని ధీమా వ్యక్తం చేశాడు ఉమైర్. అంతేకాదు రామ్ చరణ్ కారెక్టర్ గురించి ఆసక్తికరమై విషయాలు చెప్పాడు. ఎన్టీఆర్కు RRR సినిమా గేమ్ చేంజర్ అవుతుందని, ఆయనకు జాతీయ అవార్డ్ ఖాయమని అన్నారు.
RRR సినిమాకు రామ్ చరణ్ ఆత్మలాంటివాడని, ఆయన స్టైలీష్ పర్ఫామెన్స్ చూసి అభిమానులు పిచ్చెక్కిపోతారని ఉమైర్ అన్నాడు. రామ్ చరణ్ ఆ పాత్రలో జీవించేశాడు అని ప్రశంసలు జల్లు కురిపించాడు. దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు RRR సినిమాపై మరింత క్రేజ్ పెంచేశాయి.
#RamCharan is the Soul of #RRR. Fans will go gaga over his stylish performance. He Nailed it 👍❤
— Umair Sandhu (@UmairSandu) January 5, 2022