ఫిల్మ్ డెస్క్- RRR.. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత డైరెక్షన్ చేసిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగీ హీరో రామ్ చరణ్ హీరోలుగా నటించారు. చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న RRR సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా కరోనా కేసులు పెరగడంతో RRR రిలీజ్ ను వాయిదా వేశారు నిర్మాతలు.
RRR సినిమా విడుదల వాయిదా నిర్ణయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సమర్ధించారు. సినిమా విడుదల సంగతి దర్శకనిర్మాతలు చూసుకుంటారు అని తేల్చి చెప్పారు. మొత్తానికి RRR కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మళ్లీ ఎప్పుడు RRR మూవీని రిలీజ్ చేసేది నిర్మాతలు మాత్రం క్లారిటీగా చెప్పలేదు.
RRR మూవీ వాయిదా పడిందన్న నిరాశలో ఉన్న ప్రేక్షకులను మెప్పించేందుకు మేకర్స్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు . సంక్రాంతి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజాలపై కర్ర పట్టుకుని, రామ్ చరణ్ స్టైలిష్ గా నడుస్తూ కనువిందు చేశారు.
RRR సినిమాకు సంబందించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. అంతే కాదు అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ RRR సినిమాలో కనువింది చేయనున్నారు.
Pose like our RAM & BHEEM with your dearest ones 🙂 #RRRMovie pic.twitter.com/N2Hw7RVkMp
— RRR Movie (@RRRMovie) January 14, 2022
Wishing everyone a very #HappyPongal, #Bhogi, #Lohri, #MakarSankranti ❤️🔥🔥
See you soon in cinemas. pic.twitter.com/Gwt1INGbir
— DVV Entertainment (@DVVMovies) January 14, 2022