కొన్ని సార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయలోపం వల్ల వివాదాలు చోటుచేసుకుంటాయి. అధికారుల పనితీరు నచ్చక ఎంఎల్ఎలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇదే విధంగా ఓ మహిళా ఎంఎల్ఎ అధికారుల పనితీరుతో విసుగు చెంది ఓ ఇంజీనీర్ పై చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఇందులో ఏమాత్రం జాప్యం చూపినా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇలా జరగకూడదు అంటే స్థానిక ఎంఎల్ఎలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. ఈ క్రమంలో ఓ మహిళా ఎంఎల్ఎ ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన సివిల్ ఇంజినీర్ పై చేయి చేసుకుంది. అధికారుల సమాధానంతో సంతృప్తి చెందని ఆమె అసహనానికి గురై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
నగరాల్లో ఉండే ప్రజలు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇబ్బందికరంగా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారం తెలిసి వాటిని కూల్చేందుకు వచ్చిన అధికారులను అడ్డుకోవడం, అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తారు. అయితే కొంతమంది అధికారుల దురుసు ప్రవర్తనల వల్ల వివాదాలు చోటుచేసుకుంటాయి. ఇలాగే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఎంఎల్ఎ మునిసిపల్ శాఖకు చెందిన సివిల్ ఇంజినీర్ పై చేయి చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని మీరా భయాందర్ నియోజకవర్గంలో మునిసిపల్ శాఖ అధికారులు కొన్ని నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు.
అయితే అక్కడి స్థానికి ప్రజలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ నిర్మాణాలను కూలుస్తున్నారని ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎంఎల్ఎ గీతా జైన్ కు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఎంఎల్ఎ ఘటనాస్థలానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారులు ఇచ్చిన సమాదానంతో అసహనానికి గురైన ఆమె సివిల్ ఇంజినీర్ చొక్కా పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎంఎల్ఎ అలా కొట్టడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై నెటిజన్స్ స్పందిస్తూ ఎంఎల్ఎ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज शेषाबाई व्यंकटराव चव्हाण) (@surajvchavan) June 20, 2023