కోవిడ్ టీకాల విషయంలో భారత్ మరో మైలు రాయిని అందుకుందని ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన భారత ఫార్మ శాస్త్రవేత్తల పని తీరుపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాల అతలాకుతలమవుతున్న వేళ వ్యాక్సిన్ లతో ఓ భారత్ నుంచి ఓ కొత్త శక్తి పుట్టుకొచ్చిందని ఆయన కొనియాడారు.
కోవిడ్ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తమ శక్తిమేర పని చేసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూసేలా చేశారన్నా. ఇక దీంతో పాటు ధనిక, పేద తేడా లేకుండా దేశంలోని ప్రజలందరికీ టీకాల అందిస్తున్నామని, ఇది ప్రజల విజయమని కొనియాడారు. కాగా ఎన్నో సవాళ్లను అధిగమించి వంద కోట్ల డోసుల మైలు రాయిని ఎదుర్కున్నందుకు గర్వపడాల్సిన విషయమని ఆయన అన్నారు. సబ్ కా సాత్ సబ్‌కా వికాస్ లక్ష్యంతో ఎన్నో లక్ష్యాలను పొందామని, ముందు ముందు మరిన్ని విజయాలు అందుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.