మసీదు లోకి కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇస్లాం మత ఆచారం ప్రకారం మహిళలు మసీదుకు వెళ్లకూడదు. ప్రపంచంలో ఎక్కడేనా ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. దేవుడు అందరికీ ఒక్కటే కదా మరి ముస్లిం దేవాలయం అయిన మసీదులోకి మహిళలు ఎందుకు వెళ్లకూడదు అనే ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈక్రమంలో పాకిస్తాన్ నటి సబా ఖమర్ ఓ షూటింగ్ కోసం మసీదులో డాన్స్ వేయటంతో ఆమెపై పాకిస్థాన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
లాహోర్‌లోని చారిత్రక మసీదులో డ్యాన్స్ వీడియో షూటింగ్‌లో బిలాల్ సయీద్‌తో కలిసి సబా ఖమర్ పాల్గొన్నారు. దీనిపై గత ఏడాది ఆమెపై లాహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్ 295 ప్రకారం లాహోర్‌లోని పాత బస్తీలో ఉన్న మసీదు వజీర్ ఖాన్‌ను అపవిత్రం చేశారని బాలీవుడ్ నటి సబా ఖమర్‌కు కేసు దాఖలైంది. చారిత్రక మసీదులో డ్యాన్స్ వీడియోలో నటించి మసీదు పవిత్రతను దెబ్బతీశారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలు చేశారు. సబా ఖమర్ చర్యతో లాహోర్‌లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇదే ఘటనలో ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. అయితే దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని పదే పదే నోటీసులు పంపినా ఏవో సాకులు చెబుతు వారిద్దరూ హాజరుకాలేదు.
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లాహోర్ మెజిస్ట్రేట్ కోర్టు సబా ఖమర్‌తోపాటు బిలాల్ సయీద్‌పై కూడా అరెస్ట్ వారంట్లు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ డ్యాన్స్ వీడియో విషయమై సోషల్ మీడియాలో చంపేస్తామనే బెదిరింపులు రావడంతో ఆ వీడియో విషయమై వారిద్దరూ క్షమాపణలు తెలిపారు. ఇదిలా ఉంటే.. నటి సభా మాట్లాడుతూ ఆ వీడియోలో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు షూట్ చేశారనిఈ షూట్ ఇంత వివాదం అవుతుందని అనుకోలేదని దయచేసి నన్న క్షమించండీ అంటూ తెలిపింది. కాగా, రణ్‌దీప్ హుడాతో కలిసి నటించిన సినిమా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ తో బాలీవుడ్‌కు వచ్చిన సబా ఖమర్.. అనంతరం హీరోయిన్, హిందీ మీడియం సినిమాల్లో నటించింది.