రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. పుష్ప సినిమా తర్వాత రష్మిక నేషనల్ క్రష్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అటు బాలీవుడ్ లో కూడా రష్మిక వరుస ప్రాజెక్టులు చేస్తోంది. మరోవైపు జనవరి 12న విజయ్ తో కలిసి నటించిన వారీసు సినిమా రిలీజ్ కూడా కాబోతోంది. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమాపై రష్మిక పెద్దఎత్తున అంచనాలు పెట్టుకుంది. ఈ అన్ని విషయాలను తన ఫ్యాన్స్ తో స్పెషల్ లైవ్ లో పాల్గొని పంచుకుంది.
డిసెంబర్ 31న రష్మిక మందన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా కాసేపు ఫ్యాన్స్ తో ముచ్చటించింది. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రష్మిక అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పింది. మరో 10 రోజుల్లో వారీసు సినిమా రిలీజ్ ఉన్న సందర్భంగా తాను ఎంతో ఎగ్జైటెట్ గా ఉన్నానంది. అలాగే త్వరలోనే పుష్ప-2 సినిమా కూడా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
అలాగే ఈ కొత్త ఏడాది అందరికీ బాగుండాలని, అందరికీ మంచి జరగలాని ఆకాంక్షించింది. తనకి 2022 సంవత్సరాన్ని ఎంతో అద్భుతంగా మార్చారన్న రష్మిక.. ఇదంతా అభిమానులతోనే సాధ్యమైనట్లు చెప్పుకొచ్చింది. తన అభిమానులు ఎంతో అద్భుతమైన వారని చెప్పిన రష్మిక.. వారిని తాను ఎప్పటికీ ప్రేమిస్తానంటూ తెలిపింది. అలాగే తన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించింది. 2023 కూడా ఎంతో అద్భుతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఓ అభిమాని తన వయసు అడగ్గా.. తనకు 26 ఏళ్లు అంటూ సమాధానం చెప్పింది.
సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఇప్పటికే గుడ్ బై అనే సినిమాలో నటించిన రష్మిక.. మిషన్ మజ్ను అనే సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ముందు వారీసు రిలీజ్ తర్వాత ఈ మిషన్ మజ్ను రానుంది. అలాగే, హిందీలో యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక నటించనుంది. ఈ సినిమాని సందీప్ వంగ డైరెక్ట్ చేయనున్నాడు. ఆ సినిమా పోస్టర్ ని కూడా కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. పోస్టర్ లో రణ్ బీర్ కపూర్ ఎంతో భయానకంగా ఉన్నాడు. ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు.