తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు జనసేనానిగా రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక బుల్లితెరపై వస్తున్న కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. తాజాగా ఈయన జనసేనాని పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన హైపర్ ఆది మొదటి నుంచి మెగా అభిమాని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నేను కూడా చిన్న వర్క్ చేస్తున్నా… అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలిశాను. సినిమాలు, రాజకీయాల్లో ఉన్నవాళ్లను డబ్బు మార్చేస్తుందని అందరు అంటుంటారు. కానీ పవన్ కళ్యాణ్‌కు డబ్బు విషయంలో ఎలాంటి ఆసక్తి లేదు.. సినిమాల నుంచి వచ్చే డబ్బు కౌలు రైతులకు, పేదరికంలో ఉన్నవారికి సాయం చేస్తున్నారు.. అంతేకాదు ఆ డబ్బు పార్టీ కార్యకర్తల కోసం ఉపయోగిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది.. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో సంతోషిస్తాం కదా’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మీరు రాజకీయాల్లోకి వస్తారా.. ఎన్నికల్లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆది మాట్లాడుతూ.. అబ్బే అలాంటిది ఏమి లేదు అన్నారు. ఒక వేళ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పిలిచి టికెట్ ఇస్తే అని ప్రశ్నించగా.. వాళ్ళు ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. మాకు కూడా ఎంతో అనుభవం కావాలి.. ఇప్పుడే కాదు అని ఆది తెలిపాడు. నేను దూరపు ఆలోచనలు చేయనని ఆది చెప్పుకొచ్చారు.